లేపకే నా యెంకి లేపకే నిదరా
యీ పాటి సుకము నేనింత వరకెరుగనే
కలలోన నా యెంకి
కతలు సెపుతున్నాది --
వులికులికి పడుకొంట
ఊ కొట్టుతున్నాను!
కతలోని మనిసల్లె
కాసింతల్లో మారి
కనికట్టు పనులతో
కత నడుపుతున్నాది!
రెక్కలతొ పైకెగిరి
సుక్కల్లే దిగుతాది
కొత్త నవ్వుల కులుకు
కొత్త మెరుపుల తళుకు
తెలివి రానీయకే
కల కరిగిపోతాది...
ఒక్క నేనే నీకు
పెక్కు నీవులు నాకు!
No comments:
Post a Comment