Friday, December 14, 2007

ముద్దుల నా యెంకి

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
కూకుండనీదురా కూసింతసేపు


నాకేసి సూస్తాది! నవ్వు నవ్విస్తాది!!
ఎల్లి మాట్లాడొస్తే ఇసిరి కొడతాది! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ!!


కన్నుగిలికిస్తాది! నన్ను బులిపిస్తాది!!
దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాది! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ!!


ఈడుండమంటాది! ఇలుదూరిపొతాది!!
ఇసిగించి ఇసిగించి ఉసురొసుకొంటాది! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ!!


మందో మాకో యెట్టి మరిగించినాది!
వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ!!

No comments:

Post a Comment