జాము రాతిరియేళ జడుపు గిడుపూ మాని
సెట్టు పుట్టాదాటి సేనులో నేనుంటే
మెల్లంగ వస్తాది నాయెంకీ సల్లంగ వస్తాది నాయెంకీ
పచ్చని సేలోకి పండుయెన్నెల్లోన
నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటే
వొయ్యారమొలికించు నాయెంకీ వొనలచ్చి మనిపించు నాయెంకీ
యెంకివస్తాదాని ఎదురూగ నేబోయి
గట్టు మీదా దాని కంట కాపడగానే
కాలు కదపాలేదు నాయెంకీ కరిగినీరవుతాది నాయెంకీ
మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి
గోనెపట్టాయేసి గొంగడి పైనేసి
కులాస గుంటాది నాయెంకీ కులుకు సూపెడతాది నాయెంకీ
యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి
మల్లీ ఎప్పటల్లే తెల్లరబోతుంటే
సెందురున్నీ తిట్టు నాయెంకీ సూరియుణ్ణీ తిట్టు నాయెంకీ
No comments:
Post a Comment