Friday, February 8, 2008

ఎంకి ముచ్చట్లు

యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు
దొడ్డి తోవకల్లే తొంగిసూడంగానే
తోటకాడే ఉండు త్వరగొస్తనంటాది। యెన్నాని సెప్పేది...


యెంకి రాలేదాని యెటో సూత్తా ఉంటే
యెనకాలగా వచ్చి 'ఎవురువో' రంటాది। యెన్నాని సెప్పేది...


'కొడిగూసేసరికి కొంపకెల్లాలి నీ
కోసరమే సెపుతాను కోప 'మొద్దంటాది। యెన్నాని సెప్పేది...


'యెంత సేపున్నాను ఇడిసిపెట్టాలేవు
తగువోళ్ళలో మనకు తలవొంపు 'లంటాది। యెన్నాని సెప్పేది...


యెనకెనక సూత్తానె యెల్లుతాఉంటాది
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు

No comments:

Post a Comment