Sunday, December 6, 2009

దూరాన ఎంకి

యాడుంటివే ఎంకి! యాడుంటివే??
పూతోరి పందిట్లో సీతాయి యెలుతుంటే!
నీ తళుకు గేపగాన నా తల తిరిగిందోలె!
యాడుంటివే ఎంకి! యాడుంటివే??

మామిడీ తోటకెళ్ళి, మంచి పండంటి కోసి!
ఎటో గానీ నోట్లోస్తే, ఇసమయి పోయిందిలే!!
యాడుంటివే ఎంకి! యాడుంటివే??
 

పోత్తేల్ల జొన్న సేలో, సిత్తరమయి పోతాది..
గమ్మేనా వోన వస్తే గుండిగిరి పోయేనోలె!!
యాడుంటివే ఎంకి! యాడుంటివే??

4 comments:

  1. యెంకి పాటల పట్ల మక్కువ నాకూ వుంది. ఓ మారు యెంకికి నేనూ తగ్గనని కూడా వ్రాసుకున్నాను. http://maruvam.blogspot.com/2009/03/blog-post.html

    ReplyDelete
  2. బాగుందండి. గుర్తు చేసినందుకు ధన్య వాదాలు. ఒంటరి ముని మాపు దిగులు గా కూసుంటె చిలకల్లే నవ్వింది నా చిన్ని ఏంకి, తోట కే వెలుగొచ్చె చిలకాటి ఎంకి...

    ReplyDelete