ఎంకితో తీర్థానికెల్లాలి
సంకలో పిల్లోడు సంబ్రాలుపడుతుంటే!
ఎంకితో తీర్థానికెల్లాలి,
నెత్తి మూటలనెత్తుకోవాలి!
కొత్తమడతల దీసికట్టాలి!
ఆడందారుల ఎంట నడవాలి!
బరువు మారుసుకొంట ఫక్కున నవ్వాలి!
ఎంకితో తీర్థానికెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలుపడుతుంటే!
తాతానాటి ఊసు తలవాలి!
దారిపొడుగునా కీసులాడాలి!
'తప్పునీదే' యంటా దెప్పాలి !
దైవమున్నాడని ధడిపించుకోవాలి!
ఎంకితో తీర్థానికెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలుపడుతుంటే!
ఎంకితో తీర్థానికెల్లాలి!
కతకాడ కూసింత నిలవాలి!
కతగాడు మావూసే సెప్పాలి!
నను సూసి పిల్లోడు నవ్వాలి!
మాలోనమామేటో మతులిరుసుకోవాలి!
ఎంకితో తీర్థానికెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలుపడుతుంటే!
ఎంకితో తీర్థానికెల్లాలి!
కోనేటిలో తానమాడాలి!
గుడిసుట్టు ముమ్మారు తిరగాలి!
కోపాలు తాపాలు మానాలి!
ఇద్దరమూ పిల్లోన్ని ఈసుడికిసూపాలి!
ఎంకితో తీర్థానికెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలుపడుతుంటే!
ఎంకితో తీర్థానికెల్లాలి!
సశేషం
-
ఓవైపు:
పొద్దుటి పూట చద్దికూడు, రాత్రి పూట నిద్ర లొటు,
తిండి కష్టం తెచ్చిన నిద్ర నష్టం, చీడ జాడ్యం,
నీటి ఆరాటం, కరంటు పోరాటం,
వీపున పిచికారీ గొట్టాలు, ఆడ కూల...
9 years ago
No comments:
Post a Comment